రెబ్బెన: కోలిండియా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించిన బెల్లంపల్లి ఏరియా ఉద్యోగ క్రీడాకారుడిని గురువారం గోలేటి టౌన్‌షిప్‌లోని కార్యాలయంలో జీఎం విజయ భాస్కర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒడిశాలోని మహానంది కోల్డ్ ఫీల్డ్ ఆధ్వర్యంలో జరిగిన కోలిండియా స్థాయి లాన్ టెన్నిస్‌లో బెల్లంపల్లి ఏరియా గోలేటి సీహెచ్‌పీకి చెందిన మురళీకృష్ణ అద్భుత ఆటతీరుతో బంగారు పతకం సాధించాడు. అతడిని శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, డీజీఎం సివిల్ ఎస్‌కే మదీనా బాషా, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ ఎస్‌వీ రాజేశ్వర్‌రావు, క్వాలిటీ హెచ్‌వోడీ రాజేశ్, సీనియర్ పీవో శ్రీనివాస్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, నాయకులు మారం శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


