‘అభివృద్ధిలో సిర్పూర్‌ వెనుకబడింది’ | - | Sakshi
Sakshi News home page

‘అభివృద్ధిలో సిర్పూర్‌ వెనుకబడింది’

Mar 27 2026 9:17 AM | Updated on Mar 27 2026 9:17 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: సిర్పూర్‌ నియోజకవర్గం ఇప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు గురువారం అసెంబ్లీలో ప్రస్తావించారు. గత 20 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఇది మీ తండ్రి చేశారని అంటుంటారని పేర్కొన్నారు. జనజీవన స్రవంతిలో కలుస్తున్న మావోయిస్టులను అభినందించాలని, కానీ హీరోలను చేసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తాను నక్సలైట్‌ బాధితుడిని అని, చిన్నతనంలో తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఏడాది క్రైమ్‌ రేట్‌, పోక్సో కేసులు పెరిగాయని, గిరిజన మహిళల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌ దందాను అడ్డుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement