ఆసిఫాబాద్: ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సఫలీకృతులవుతున్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసి న మొబైల్ రికవరీ మేళాలో రూ.10 లక్షల విలువైన 108 ఫోన్లను ఎస్పీ నితిక పంత్ చేతుల మీదుగా యజమానులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ లేనిదే ఏ చిన్న లావాదేవీ కూడా చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంక్ అకౌంట్స్, పాస్‌వర్డ్స్ వంటి వాటితో పాటు విలు వైన సమాచారాన్ని సేవ్ చేసుకుంటున్నారని తెలిసి నేరగాళ్లు ఫోన్లు దొంగిలిస్తున్నారన్నారు. వీక్ పాస్ వర్డ్స్ బ్రేక్ చేసి చేసి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. బాధితులు వ్యక్తిగత సమాచారంతో డబ్బులు కోల్పోతున్నారన్నారు. మొబైల్ పోగొట్టుకున్న వ్యక్తులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్ https://www.ceir.gov.in లో బ్లాక్ చేసి, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సూచించారు. సెకెండ్ హ్యాండ్ మొ బైళ్లు కొనుగోలు చేస్తే, షాపు యజమాని నుంచి రసీదు తీసుకోవాలన్నారు. దొంగిలించిన ఫోన్లను తెలిసి కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐలు బాలాజీ వరప్రసాద్, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


