ఆసిఫాబాద్‌అర్బన్: భగత్‌సింగ్ త్యాగ స్ఫూర్తితో కార్పొరేట్లు, సామ్రాజ్యవాద, మతోన్మాద ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాస్, దినకర్ పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌సింగ్ ఆశయాలను అధ్యయనం చేయాలని, వీలునామా పుస్తకాన్ని చదవాలని సూచించారు. లౌకికవాద విధానాన్ని కాపాడుకోవడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌కుమార్, రాజేందర్, మాలశ్రీ, రాజ్‌కుమార్, తిరుపతి, మనోహర్, శ్రీకాంత్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


