శిశుగృహకు నవజాత శిశువు | - | Sakshi
Sakshi News home page

శిశుగృహకు నవజాత శిశువు

Mar 24 2026 7:00 AM | Updated on Mar 24 2026 7:00 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మండలం సీతానగర్‌ సమీపంలోని పత్తి చేనులో గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లిన నవజాత శిశువును సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని శిశుగృహానికి తరలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్న శిశువు ఆరోగ్య పరిస్థితిని ఎస్పీ నితిక పంత్‌ పరిశీలించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్‌, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్‌ పర్యవేక్షణలో ఆదిలాబాద్‌ శిశు గృహానికి తరలించా రు. ప్రస్తుత చట్టాలు, మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్తులో శిశువును చట్టబద్ధంగా దత్తత ఇస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement