ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్‌కు మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు 15 మండలాలకు ఏడుగురే ఈసీలు ప్రస్తుతం పనిచేస్తున్న వారిపైనే అదనపు భారం పనులపై తగ్గుతున్న పర్యవేక్షణ
తిర్యాణి: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం(వీబీ జీ రామ్ జీ)లో సిబ్బంది కొరత వే ధిస్తోంది. నూతన నిబంధనలతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్, ఏపీవో పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో పనులపై పర్యవేక్షణ లోపిస్తోంది. నిరుపేద కుటుంబాలకు పనిదినా లు కల్పించాల్సిన బాధ్యతగా సిబ్బందిపై ఉన్నా క్షేత్రస్థాయిలో అవసరానికి అనుగుణంగా సిబ్బంది నియామకాలు జరగడం లేదు. మరోవైపు 2026– 27 ఆర్థిక సంవత్సరం నుంచి వంద రోజుల పని దినాలను 125 రోజులకు పెంచారు.
ఉన్నవారిపై పనిభారం
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా 1.22 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 2.43 లక్షల మంది కూలీల పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే 88 వేల యాక్టీవ్ జాబ్‌కార్డుల్లో 1.61 లక్షల మంది కూలీలు పనులకు వెళ్తున్నా రు. అయితే ఉపాధిహామీ పథకంలో సిబ్బంది కొర త సృష్టంగా కనిపిస్తోంది. జిల్లాలోని 15 మండలా లకు మండలానికి ఒక్కరు చొప్పున 15 మంది ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు(ఈసీలు) ఉండాలి. కానీ జిల్లాలో ప్రస్తుతం ఏడు ఈసీలు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈసీలు లేనిచోట టెక్నికల్ అసిస్టెంట్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పనులు ము మ్మరంగా సాగే సమయంలో ఈసీల పాత్ర ఎంతో కీలకం. పనుల నిర్వహణ సంబంధించిన మ్యాపింగ్‌తోపాటు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. టెక్నికల్ అసిస్టెంట్లు చేసిన ఎంబీ రికార్డులపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అలాగే మండలస్థాయి పర్యవేక్షకులైన అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి(ఏపీవో) పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. 15 మంది ఏపీవోలు అవసరం ఉండగా 12 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఏపీవోలు లేనిచోట సైతం టీఏలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఏపీవో, ఈసీ పోస్టులు ఖాళీగా ఉండటంతో టీఏ(టెక్నికల్ అసిస్టెంట్)లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తుండటంతో వారిపై పనిభారం పడుతోంది. వారి సాధారణ పనులతోపాటు అదనపు బాధ్యతలు నిర్వహించడం తలనొప్పిగా మారింది. దీనికితోడు కొత్త పంచాయతీలు ఏర్పడటంతో ఒక్కో టీఏ దాదాపు పది పంచాయతీల్లో పనులను పర్యవేక్షించాల్సి వస్తోంది.
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు(ఫైల్)
335 జీపీలకు 148 మందే ఎఫ్‌ఏలు
పనుల నిర్వహణలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీల కం. కానీ జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత కూడా వేధిస్తోంది. 335 పంచాయతీలకు ప్రస్తుతం కేవలం 148 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో ఏఫ్‌ఏ మూడు, నాలుగు గ్రామాల్లో ఏకకాలంలో పనులు చేయించాల్సి వస్తోంది. నూతన జీపీల వారీగా ఫీల్డ్ అసిస్టెంట్ల నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. నియామకాలు చేపట్టాలని సిబ్బంది, కూలీలు కోరుతున్నారు.


