ఇక ఇక్కడే రిపేర్లు | - | Sakshi
Sakshi News home page

ఇక ఇక్కడే రిపేర్లు

Mar 24 2026 7:00 AM | Updated on Mar 24 2026 7:00 AM

● కాగజ్‌నగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం ప్రారంభం

కాగజ్‌నగర్‌టౌన్‌: విద్యుత్‌ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు ఆ శాఖ అధికారులు చ ర్యలు చేపట్టారు. ఇక నుంచి ట్రాన్స్‌ఫార్మర్లను స్థాని కంగానే బాగుచేయనున్నారు. కాగజ్‌నగర్‌ విద్యుత్‌ డివిజన్‌ పరిధిలో మరమ్మతుల కేంద్రం ఉన్నా 20 ఏళ్లుగా అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో వి నియోగదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే దూరప్రాంతాలకు తరలించాల్సి వచ్చేది. గ్రామీణ ప్రాంతంలో రోజుల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇ బ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కా రం దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా ఈ నెల 18న కాగజ్‌నగర్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో హన్మకొండ కార్పొరేట్‌ కార్యాలయం ఛీప్‌ ఇంజినీర్‌ అశోక్‌ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక నుంచి డివిజన్‌ పరిఽధిలో విద్యుత్‌ సమస్యలు వేగంగా పరిష్కారం కానున్నాయి.

వేగంగా మరమ్మతులు

కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలో అనేక మారుమూల గ్రామాలు ఉన్నాయి. గాలివానలు, ఇతర కారణాలతో ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోతే రోజులపాటు పల్లెలు అంధకారంలో ఉండేవి. ప్రస్తుతం ట్రాన్స్‌ఫార్మర్ల కేంద్రం అందుబాటులోకి రావడంతో మరమ్మతుల ప్రక్రియ వేగవంతం కానుంది. విద్యుత్‌ అంతరాయం తగ్గుతుంది. అలాగే ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, రవాణా ఖర్చులు తగ్గనున్నాయి. రైతులకు సమయానికి విద్యుత్‌ అందించడం ద్వారా బోర్లు, మోటార్లు సక్రమంగా పనిచేస్తాయి. అలాగే విద్యుత్‌శాఖ సేవల స్థితిగతులను తెలుసుకునేందుకు 1912 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశారు. వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఈ నంబర్‌కు సమాచారం అందిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంబంధిత వాహనాల ద్వారా ఘటన స్థలానికి చేరుకుని పరిష్కరిస్తారు.

నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం

జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యం. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రం ద్వారా డివిజన్‌లో ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ట్రాన్స్‌ఫార్మర్లను తరలించేందుకు 1912 వాహనంతో పాటు రెండు వాహనాలు ఉన్నాయి. వినియోగదారులు హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేసి సేవలు వినియోగించుకోవాలి.

– ఉత్తమ్‌ జాడే, ఎస్‌ఈ, ఆసిఫాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement