పురం.. మహిళల పరం | - | Sakshi
Sakshi News home page

పురం.. మహిళల పరం

Feb 14 2026 8:07 AM | Updated on Feb 14 2026 8:07 AM

పురం.. మహిళల పరం

పురం.. మహిళల పరం

● కాగజ్‌నగర్‌లో 20 మంది కౌన్సిలర్లుగా విజయం

కాగజ్‌నగర్‌రూరల్‌/చింతలమానెపల్లి: కాగజ్‌నగర్‌ పట్టణ మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలు విజయ బావుటా ఎగురవేశారు. 30 వార్డుల్లో 20 మంది మహిళామణులే విజయం సాధించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు కేటాయించగా ప్రధాన పార్టీలన్నీ మహిళలనే బరిలో నిలిపాయి. 23వ వార్డులో గెలుపొందిన గజ్జి స్వాతి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం వదిలి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించా రు. చింతలపాణి విద్యావతి మున్సిపల్‌ చైర్‌పర్స న్‌గా గతంలో పనిచేశారు. 15వ వార్డులో బీఆర్‌ఎ స్‌ అభ్యర్థిగా నిలిచి నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలు పొందారు. పట్టణంలో ప్రముఖ వైద్యురాలుగా పనిచేస్తున్న కొత్తపల్లి అనిత 29వ వార్డులో బీజేపీ నుంచి పోటీచేసి గెలిచారు. మూడో వార్డు నుంచి గెలుపొందిన అలియా బేగం కుటుంబం నుంచి గత రెండుసార్లు పోటీ చేసి ఓడిపోగా, ఈసారి ఎంఐఎం తరఫున పోటీ చేసిన ఆమెను విజయం వరించింది. ఎమ్మాజీ శారద కుటుంబ సభ్యులు గతంలో ఐదుసార్లు పోటీచేసి ఓడిపోగా, ఆరో వా ర్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఈసారి ఆమె గెలుపొంది కుటుంబ సభ్యుల ఆశలను నిలబెట్టారు. వార్డు కౌన్సిలర్లలో అత్యధిక ఆధిక్యం మహిళకే దక్కింది. వార్డు నంబర్‌ 12లో పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి అల్లాడి దుర్గమ్మ అత్యధికంగా 452 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం గమనార్హం. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుండగా, కాగజ్‌నగర్‌ పట్టణంలో వారే సత్తా చాటారు. విజేతలకు ఆయా వార్డుల్లో ప్రజలు ఘన స్వాగతం పలికి సంబురాలు జరుపుకొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement