పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో శుక్రవారం పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులకు జిల్లాస్థాయి క్రీడాపోటీలు(బాలురు) నిర్వహించారు. జిల్లా అకడమిక్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్కో పీఎం శ్రీ పాఠశాలకు క్రీడల నిర్వహణ కు రూ.50 వేలు మంజూరు చేసినట్లు తెలిపా రు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. పోటీల ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. 17 పీఎం శ్రీ పాఠశాలల నుంచి 450 మంది బాలురు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. వాలీబాల్‌లో బాబాసాగర్ ఉన్నత పాఠశాల ప్రథమ స్థా నంలో నిలవగా, ఖోఖోలో తెలంగాణ మోడ ల్ స్కూల్, కబడ్డీలో తెలంగాణ మోడల్ స్కూ ల్, ఫుట్‌బాల్‌లో కాగజ్‌నగర్ ఉన్నత పాఠశా ల విద్యార్థులు ప్రథమ స్థానం కై వసం చేసుకున్నారని వెల్లడించారు. శనివారం బాలికలకు జిల్లాస్థాయి పోటీలు ఉంటాయన్నారు. ఎస్ వో దేవాజీ, ప్రిన్సిపాల్ మహేశ్వర్, పీడీలు తిరుపతి, రాకేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


