నగరం నుంచి పల్లెకు..
వృథా కావొద్దని..
రెబ్బెన: ప్రజాస్యామ్య పద్ధతిలో నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఓటు వృథా కావొద్దనే ఉద్దేశంతో హైదరాబా ద్ నుంచి గోలేటికి వచ్చా. ఎన్నికల జరిగిన ప్రతిసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటా.
– మద్దెల రవీందర్,
ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్
ఓటు ద్వారా అవకాశం
రెబ్బెన: గోలేటి నుంచి వెళ్లి ఉద్యోగరీత్యా చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చా. గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఓటుహక్కు ద్వారా ఎన్నుకునే అవకాశం ఉంది. – అరుట్ల సాగర్,
ప్రైవేటు ఉద్యోగి, హైదరాబాద్
కరీంనగర్ నుంచి వచ్చా..
ఆసిఫాబాద్‌అర్బన్: కరీంనగర్‌లో డిగ్రీ చదువుతున్న. ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆసిఫాబాద్‌కు వచ్చా. రాజంపేటలో ఓటు వేసిన. ఎంత దూరంలో ఉన్న ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును వినియోగించుకోవాలి.
– టి.రమ్య, డిగ్రీ విద్యార్థిని
నగరం నుంచి పల్లెకు..
నగరం నుంచి పల్లెకు..


