ఏరియాలో చీఫ్ సెక్యూరిటీ అధికారి పర్యటన
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు బుధవారం తొలిసారి పర్యటించారు. ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సెక్యూరిటీ గార్డ్స్, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. వారి పనితీరు, సమస్యలు, సౌకర్యాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏరియా స్టోర్స్, గోలేటి ఆర్చీ చెక్‌పోస్టులు, సెంట్రల్ స్క్రాప్ యార్డ్‌ను తనిఖీ చేశారు. సింగరేణి ఆస్తుల పరిరక్షణలో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఏరియా సర్వే అధికారి అఫ్సర్ పాషా, బీపీఏ ఓసీపీ మేనేజర్ మహేశ్, ఏరియా సెక్యూరిటీ అధికారి శ్రీధర్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ రాజమౌళి, సిబ్బంది పాల్గొన్నారు.


