● ముగిసిన పంచాయతీ పోరు ● మూడో విడతలో నాలుగు మండలాల్లో ఎ
ఆసిఫాబాద్: ఉత్కంఠగా సాగిన పల్లె పోరు ముగి సింది. 15 మండలాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. తుది విడతలో భాగంగా గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఓటు వేసేందుకు పల్లెజనం కదిలొచ్చారు. 83.32శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్ర కటించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్ట ర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును పర్యవేక్షించారు.
83.32 శాతం పోలింగ్
ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్, తిర్యాణి మండలాల్లో 1,21,004 మంది ఓటర్లు ఉండగా, 1,00,815 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 50,817 మంది పురుషులు, 49,995 మంది మహిళలు ఓటేశారు. 83.32 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 79.81 శాతం, రెండో విడతలో 86.64 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 15 మండలాల్లో మూడు విడతల్లో నిర్వహించిన ఎన్నికల్లో సగటున 83.27 పోలింగ్‌శాతం నమోదైంది. తొలివిడత ఏజెన్సీ ప్రాంతాలతో పోలిస్తే సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రెండో విడతలో పోలింగ్ శాతం పెరిగినా, మూడో విడతలో మళ్లీ స్వల్పంగా తగ్గింది. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, బీజేపీ జిల్లా నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, ఇతర నాయకులు తమ మద్దతుదారులను గెలిపించాలని పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను అభ్యర్థించారు. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్, కాగజ్‌నగర్ మండలం కోసిని పంచాయతీల్లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు
రాజంపేట పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్యతోపాటు పలు వురు ఓటుహక్కు వినియోగించకున్నారు.


