డ్యూటీలో గురుశిష్యులు
ఆసిఫాబాద్‌రూరల్: మండలంలోని మోతుగూడ పోలింగ్ కేంద్రంలో గురుశిష్యులు ఒకేచోట విధులు విధులు నిర్వర్తించారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–02లో అబ్దుల్ లతీఫ్ గణిత ఉపాధ్యాయులుగా పనిచేయగా, అదే స్కూల్‌లో కమలాకర్, నాగార్జున చదువుకున్నారు. ప్రస్తుతం రెబ్బెన మండలం గంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ లతీఫ్ పనిచేస్తుండగా, కమలాకర్ ఆసిఫాబాద్ ఎస్సైగా, నాగార్జున తిర్యాణి బీట్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మోతుగూడలో లతీఫ్‌కు ఎన్నికల విధులు కేటాయించడంతో బందోబస్తుకు వచ్చిన శిష్యులను కలుసుకున్నారు.


