సిర్పూర్(టి) రైల్వేస్టేషన్ తనిఖీ
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను బుధవారం రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్‌లోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిర్పూర్(టి) వరకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని, అజ్నీ ప్యాసింజర్ రైలు స్టాప్ కేటాయించాలని, ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్ సిర్పూర్(టి) వరకు పొడిగించాలని నూతన సర్పంచ్ వడ్డేటి నాగమణి, వార్డు సభ్యులు విన్నవించారు. స్టేషన్‌లో డంపింగ్‌యార్డు ఏ ర్పాటు చేయాలని, సమస్యలు పరిష్కరించా లని కోరారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎంను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దుర్గం ప్రశాంత్, వార్డు సభ్యులు సాయి, మొఖరం హుస్సేన్, అస్లాం, నాయకులు వడ్డేటి నానయ్య, మోయిజ్, పైడి విలాస్, శ్యాంరావ్, నులిగొండ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


