ఓటర్లకు ఇబ్బందులు రానీయొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు రానీయొద్దని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. రెబ్బెన మండలం ఖైరిగాంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, విద్యుత్ సౌకర్యంతోపాటు ర్యాంపు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రం పరిశీలన
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ మండలం అంకుశాపూర్‌లోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం రాత్రి అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎంపీడీవో ఉజ్వల్ కుమార్, అధికారులు ఉన్నారు.


