సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలి
ఆసిఫాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల సామగ్రి సక్రమంగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సోమవారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది మంగళవారం నిర్దేశిత సమయానికి తమకు కేటాయంచిన సామగ్రితో పంపిణీ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించిన సామగ్రి పంపిణీ చేస్తామన్నారు. పోలింగ్, పోలీసు సిబ్బంది, సూక్ష్మ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తామని తెలిపారు.


