తుది విడత ప్రచారానికి నేడు తెర
ఆసిఫాబాద్‌రూరల్: తుదివిడత ఎన్నికల ప్రచారాని కి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఈ నెల 17న ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 108 జీపీలు ఉండగా, కాగజ్‌నగర్‌లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 106 స్థానాలకు 377 మంది బరిలో నిలిచారు. 938 వా ర్డు స్థానాలకు 186 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగి లిన స్థానాల్లో 2,098 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగజ్‌నగర్ మండలాల్లో 26 సర్పంచ్ స్థానాలకు 115 మంది అభ్యర్థులు, ఆసిఫా బాద్‌లో 27 స్థానాలకు 82 మంది, రెబ్బెనలో 24 స్థానాలకు 89 మంది, తిర్యాణిలో 29 సర్పంచ్ స్థానాలకు 91 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సోమవారం సాయంత్రం ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు మద్యం, డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


