ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల అధికారులకు నిర్దేశిత సమయానికి సామగ్రి పంపిణీ పూర్తవుతుందన్నారు. ఇబ్బందులు లేకుండా అధికారులు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీమొద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


