సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి అధికారులు, ఉద్యోగులకు సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరమని ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించారు. సింగరేణి కార్పొరేట్ ఐటీ డీజీఎం ఎం.శ్రీనివాస్‌రావు, మేనేజర్ నానా ఫర్నవీస్ ఉదయం ఉద్యోగులకు, మధ్యాహ్నం అధికారులకు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. జీఎం మాట్లాడుతూ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, కుటుంబ సభ్యుల ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టొద్దన్నారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, గోలేటి ఓసీపీ ప్రాజెక్టు అధికారి ఉమాకాంత్, డీవైసీఎంవో పాండు రంగాచారి, ఏరియా ఐటీ మేనేజర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.


