ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని గంగాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న పెయింటింగ్, తరగతి గదుల మరమ్మతులను పరిశీ లించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి అభ్యసన సామర్థ్యాలు పరీక్షించారు. తరగతి గదిలో కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకటేశ్వర్లు, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం లతీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


