కోతులను నియంత్రించాలని ఆందోళన
కెరమెరి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలో కొన్నేళ్లుగా బీభత్సం సృష్టిస్తున్న కోతులను నియంత్రించాలని మంగళవారం వివిధ సంఘాల నాయకులు, వ్యాపారులు ఆందోళన తెలిపారు. అంబేడ్కర్ చౌక్ నుంచి రేంజ్ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎఫ్‌ఆర్‌వో మజారొద్దీన్‌కు వినతి పత్రం అందించారు. కోతులు చిన్నారులపై దాడులు చేస్తు న్నా నియత్రణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఉన్నతాధికారులతో పాటు ఎంపీడీవో, పంచాయతీ అధికారులతో చర్చిస్తామని ఎఫ్‌ఆర్‌వో హామీ వారికి ఇచ్చా రు. కార్యక్రమంలో నాయకులు కూటికల ఆనంద్‌రావు, రాథోడ్ రమేశ్, గిత్తే తిరుపతి, వినేశ్, తుకారాం, సుజాయిత్‌ఖాన్, స్వామి, సుధాకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


