స్కిల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీ ణ కౌశల్ యోజన ద్వారా ప్రారంభించిన స్కిల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గల సుప్రభాత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్‌ను మంగళవారం ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్కిల్ సెంటర్‌ను యువకులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోని నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాగజ్‌నగర్‌లో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎంతో సహకరించారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో గ్రామీణ, పట్టణ నిరుద్యోగులకు ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పించి నైపుణ్య శిక్షణ అందిస్తారని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు కల్పిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈడీ ఈజీఎంఎంఏ కృష్ణన్, డీఆర్డీవో దత్తారావు, తహసీల్దార్ మధుకర్, పాఠశాల చైర్మన్ ఘనపురం మురళీధర్, రిటైర్డ్ హెచ్‌ఎం తోట వినోద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


