మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
దహెగాం(సిర్పూర్): అడవులతోపాటు ప్లాంటేషన్‌లోని మొక్కలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని సీఎఫ్ ఎఫ్‌డీపీటీ కవ్వా ల్ రిజర్వ్ శాంతారాం అన్నారు. దహెగాం మండలం గిరవెల్లి బీట్‌లోని చంద్రపల్లి, ఒడ్డుగూడ గ్రామ సమీపంలో గల ప్లాంటేషన్లను సోమవారం పరిశీలించారు. ప్లాంటేషన్‌లో మొక్కల ఎదుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులకు హాని తలపెట్టొద్దన్నారు. అడవుల్లో చెట్లను నరికితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, ఎఫ్‌డీవో దేవిదాస్, ఎఫ్‌ఆర్వో బానేశ్, ఎఫ్‌ఎస్‌వో సద్దాం, ఎఫ్‌బీవోలు తదితరులు పాల్గొన్నారు.


