ప్రజావాణికి వినతుల వెల్లువ
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో గల జీ1 కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. అదనపు కలెక్టర్ దీపక్ తివారి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచకుండా అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ విక్రయించేందుకు వీలుగా తోటకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామానికి చెందిన పోతిని చిన్న వెంకటస్వామి దరఖాస్తు అందించారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామ శివారులో కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుపుస్తకం మంజూరు చేయాలని మండల కేంద్రానికి చెందిన పాముల నందు కోరాడు. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ అనుషాబాయి వేడుకుంది. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన పాలకుర్తి సంతరక్క, కాగజ్‌నగర్ పట్టణంలోని న్యూకాలనీకి చెందిన మాధవి వేర్వేరుగా అర్జీలు అందించారు. ఆన్‌లైన్‌లో తన భూమి ఇతరుల పేరుతో నమోదైందని, దీనిని సవరించాలని బెజ్జూర్ మండలం సోమిని గ్రామాని కి చెందిన అల్లూరి లింగయ్య దరఖాస్తు చేసుకున్నా డు. రెబ్బెన మండలం కొండపల్లిలో బుద్ధనగర్‌లో 20 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేయాలని వేడుకున్నారు. ఐదో తరగతి వరకు చదివిన తనకు ఐటీడీఏ ఆధ్వర్యంలో కిరాణం ఏర్పాటుకు రుణం మంజూరు చేయాలని తిర్యాణి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన టేకం పోసుబాయి కోరింది.
ఇల్లు మంజూరు చేయాలి
దివ్యాంగుడినైన నేను డిగ్రీ వరకు చదివా. సొంత భూమితోపాటు ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ప లుమార్లు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. ఉన్నతాధికారులు నా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.– పాలకుర్తి రాజ్‌కుమార్,
ముత్యంపేట, మం.కౌటాల
అటవీ హక్కు పత్రాలు ఇప్పించండి
తిర్యాణి మండలం మాణిక్యాపూర్, లొద్దిగూడ శివా రులో నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నా. ప్రభుత్వం చాలా మందికి పట్టాలు మంజూరు చేసింది. ఏళ్లుగా భూమిపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నిరుపేదనైన తనకు కూడా అటవీ హక్కు పత్రాలు ఇప్పించాలి.
– టేకం మారుతి, లొద్దిగూడ, మం.తిర్యాణి
ప్రజావాణికి వినతుల వెల్లువ
ప్రజావాణికి వినతుల వెల్లువ


