ఉత్కంఠగా సాగిన లక్కీడ్రా
25 మద్యం షాపులు కేటాయింపు.. ఏడు పెండింగ్ డిసెంబర్ నుంచి కొత్త వైన్స్‌లు ప్రారంభం
ఆసిఫాబాద్: నెల రోజులుగా ఉత్కంఠగా సాగి న మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. భారీ బందోబస్తు మధ్య సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో షాపుల కేటా యింపు కోసం లక్కీడ్రా నిర్వహించారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్, ఎకై ్సజ్ శాఖ ఉద్యోగుల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే స్టీలు డబ్బాలో ఒక్కో దుకాణానికి గెజిట్ నంబర్ ప్రకారం ల క్కీడ్రా నిర్వహించారు. షాపుల వారీగా ప్లాస్టిక్ కాయిన్లు తీశారు. జిల్లా వ్యాప్తంగా 32 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. లక్కీడ్రా ద్వారా 25 దుకాణాలను కేటాయించా రు. పదికంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన ఏడు షాపుల లక్కీడ్రాను వాయిదా వేశారు.
మహిళలకు మూడు షాపులు
లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న ఫుల్‌జోష్ లో ఉండగా, రూ.లక్షలు వెచ్చించి టెండర్లు వేసినా అదృష్టం కలిసిరాని వారు నిరాశతో వెళ్లి పోయారు. ఒక్కో షెడ్యూల్‌కు రూ.3 లక్షలు వెచ్చించినా దుకాణాలు పొందలేకపోయామ ని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ముహూర్తం, మంచిరోజులు చూసుకుని దరఖాస్తులు వేసినా ఫలితం లేకుండాపోయింది. కొందరు 10 నుంచి 12 మంది వరకు గ్రూపులుగా ఏర్ప డి టెండర్లు దాఖలు చేశారు. గ్రూపులో ఉన్న వారికి ఎంతో కొంత ముట్టజెప్పి భాగస్వామ్యం తగ్గించుకునే ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయి. మరోవైపు పలువురు మహిళలు సైతం టెండర్లలో దుకాణాల కోసం పోటీపడ్డారు. ఈ ఏడాది ముగ్గురు మహిళలు దుకాణాలు దక్కించుకున్నారు. వైన్స్‌లు దక్కించుకున్న వారు వెంటనే 25 శాతం లైసెన్స్ ఫీజు చెల్లించేలా అక్కడే బ్యాంకు సిబ్బందితో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 1 నుంచి మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. జిల్లాలో పది కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన జైనూర్‌లోని రెండు షాపులు, సిర్పూర్–యూ, రెబ్బెన, గోలేటి, కాగజ్‌నగర్, రవీంద్రనగర్ దుకాణాల లక్కీడ్రాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జ్యోతికిరణ్ వెల్లడించారు.
వైన్స్‌లు పొందిన వారు వీరే..
జిల్లాలోని 25 దుకాణాలను లక్కీడ్రా ద్వారా కేటాయించారు. గెజిట్ ప్రకారం నంబర్ 01 షాపును చునార్కర్ వసంత్‌రావు దక్కించుకోగా, 02 గుజాల అశోక్, 03 తోట వినోద్, 04 తొగరి జగన్, 05 పల్లె సంతోష్ కుమార్, 06 బుర్ర రజిత, 07 మల్యాల సుదర్శనమ్, 08 గాలె సంతోష్, 11 రుకుం ప్రహ్లాద్, 12 బోనగిరి నరేశ్, 13 రంగు రవీందర్‌గౌడ్, 15 ముద్దసాని అశ్విని, 16 సుంకర్ లక్ష్మణ్ కుమార్, 17 చల్లా శ్రీకాంత్ రెడ్డి, 18 దాసరి వైకుంఠం, 19 రాచర్ల వైకుంఠం, 20 మౌల్కార్ విఠల్, 21 బండి నికిత, 23 కుమురం నగేశ్, 24 రంగు ఉపేంద్రాచారి, 25 పల్లె సంపత్‌కుమార్, 26 లెండిగురె విఘ్నేశ్, 27 బోయిరె బావాజీ, 28 రామగోని మల్లికార్జున్‌గౌడ్, 29వ షాపును బట్టకుంట మల్లేశ్ దక్కించుకున్నారు.


