అవినీతి లేని సమాజంలో వేగంగా అభివృద్ధి
రెబ్బెన(ఆసిఫాబాద్): అవినీతి లేని సమాజంలో వేగంగా అభివృద్ధి జరుగుతుందని సింగరేణి డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయం ఆవరణలో సోమవారం విజిలెన్స్ వారోత్సవాల సమావేశం ఏర్పాటు చేశారు. జీఎం విజయ భాస్కర్‌రెడ్డితో కలిసి విజిలెన్స్ వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత పారదర్శకత ఉన్న సంస్థ సింగరేణి అని అన్నారు. అవినీతికి తావులేకుండా అన్ని కార్యకలాపాలు పూర్తి పారదర్శకతతో సాగుతున్నాయని తెలిపారు. అనంతరం ఉద్యోగులతో కలిసి అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తామని, నిజాయతీగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు కిరణ్, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


