కొత్తరూపు | - | Sakshi
Sakshi News home page

కొత్తరూపు

Oct 27 2025 8:26 AM | Updated on Oct 27 2025 8:26 AM

కొత్తరూపు

కొత్తరూపు

● జిల్లాలో 30 రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ● హ్యామ్‌ విధానంలో అభివృద్ధి ● తొలగనున్న రవాణా తిప్పలు

రహదారులకు

ఆసిఫాబాద్‌: జిల్లాలోని రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రవాణాను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రహదారులను విస్తరించడంతోపాటు కొత్త రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆసిఫాబాద్‌–ఉట్నూర్‌ రోడ్డుతోపాటు గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనుంది. జిల్లాలో 30 రహదారులకు మహర్దశ పట్టనుంది. కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో పక్కా రోడ్లు నిర్మించాలని ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యూ టి మోడల్‌) విధానంలో మొదటి దశలో ఈ రోడ్లు నిర్మించనుంది. త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

140.66 కిలోమీటర్లు..

జిల్లా వ్యాప్తంగా 30 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా 140.66 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆసిఫాబాద్‌ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోవింద్‌పూర్‌ వరకు 2.40 కిలోమీటర్లు నిర్మించనున్నారు. అలాగే పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈదులవాడ వరకు 4.80 కి.మీ.లు, పీఆర్‌ రోడ్డు నుంచి వట్టివాగు ప్రాజెక్టు వరకు 3.40 కి.మీ.లు, వీవీపీ రోడ్డు నుంచి కౌటగూడ 5.25, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పర్శనంబాల 5, కెరమెరి మండలం ఎన్టీఆర్‌రోడ్డు నుంచి సావర్‌ఖేడా 4.45, కెలి– కె నుంచి బాలాపటార్‌ ఏసాపూర్‌ 6.90, ఓడీఆర్‌ అనార్‌పల్లి నుంచి శంకర్‌గూడ వయా కరంజీవాడ 4.50, వాంకిడి మండలం వీఆర్‌ఎస్‌ నుంచి జంబుల్దరి 265 ఎన్‌హెచ్‌ నుంచి కోమటిగూడ 3.80, పీఆర్‌రోడ్డు నుంచి ముకాసిగూడ వయా సరండి 9.30, పీఆర్‌ రోడ్డు నుంచి మర్కగూడ 1, జైనూర్‌ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జామిని 0.95, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పవార్‌గూడ పొలాస 3.05, సిర్పూర్‌(యూ) మండలం ఆర్‌ఎఫ్‌రోడ్డు మహాగావ్‌ నుంచి గుమ్నూరు– బి వయా ధనోరా చాపరి 5.80, పీడబ్ల్యూడీ రోడ్డు పవార్‌ నుంచి దేవుడుపల్లి 1.30, లింగాపూర్‌ మండలం రామునాయక్‌ తండా నుంచి ఎల్లాపటార్‌ గోండుగూడ 3.15, అలీగూడ నుంచి పిక్లాతండా వయా గుమ్మునూరు కాంచన్‌పల్లి, కొత్తపల్లి 13.20, చింతలమానెపల్లి మండలం గుడ్లబోరి నుంచి బాబాసాగర్‌ వయా సైబాపూర్‌ 2,, కౌటాల నుంచి కోర్సిని వయా రణవెల్లి 10, కౌటాల మండలం గుడ్లబోరి నుంచి బాబాపూర్‌ వయా సైదాపూర్‌ 3.30, కాగజ్‌నగర్‌ మండలం ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కొత్త సార్సాల 0.90, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వంజరి 2.70, బెజ్జూర్‌ మండలం జెడ్పీ రోడ్డు నుంచి ముంజంపల్లి 1.46, పెంచికల్‌పేట్‌ మండలం ఎల్కపల్లి నుంచి ఎల్లూరు 2.20, దహెగాం మండలం పీపీరావు కాలనీ నుంచి సుర్దాపూర్‌ 8.60, సిర్పూర్‌(టి) మండలం ఎన్‌హెచ్‌ నుంచి శివపూర్‌ వయా షేక్‌ అహ్మద్‌గూడ, ఎండీఆర్‌ నుంచి పొడస వరకు 1.80 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేయనున్నారు.

మొరుగుపడనున్న రవాణా

జిల్లాలో కొత్తగా మంజూరైన రహదారుల నిర్మాణం పూర్తయితే రవాణా సేవలు మెరుగుపడనున్నాయి. జిల్లా కేంద్రం నుంచి ఉట్నూర్‌ వెళ్లే రహదారిపై గుంతలు పడి, కంకర తేలి ప్రయాణం నరకప్రాయంగా మారింది. 70 కిలోమీటర్ల ప్రయాణానికి మూడు గంటల సమయం పడుతుంది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాలు సైతం దెబ్బతింటున్నాయని యజమానులు వాపోతున్నారు. మారుమూల ప్రాంతాలకు సక్రమంగా దారులు లేకపోవడంతో అంబులెన్స్‌లు వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా గర్భిణులను అత్యవసర సమయంలో ఆస్పత్రులకు తరలించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్‌ మండలంలో ఓ గర్భిణి వాగులోనే ప్రసవించిన విషయం తెలిసిందే. కొత్త దారులు మంజూరు కావడంతో సేవలు మెరుగుపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా వేగంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

ఆసిఫాబాద్‌ నుంచి కెరమెరికి వెళ్లే రహదారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement