నిందితులను కఠినంగా శిక్షించాలి
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన నిండు గర్భిణి శ్రావణిని కిరాతకంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి తిరుపతయ్య డిమాండ్ చేశా రు. ఆదివారం గ్రామంలో శ్రావణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహం చేసుకుందనే అక్కసుతో గిరిజన యువతిని హత్య చేయడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఒడ్డుగూడకు చెందిన పశువు ల కాపరి బుజాడి రామన్నపై దాడి చేసిన ఎఫ్‌ఎస్‌వో సద్దాంపై చర్యలు తీసుకోవాలన్నా రు. అటవీశాఖ అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు అన్వర్, సుజాయిల్‌ఖాన్, దిలీప్, బక్కయ్య, అచ్యుత్ తదితరులు ఉన్నా రు.


