కేంద్రె బాలాజీకి రైతునేస్తం అవార్డు
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు కేంద్రె బాలాజీని మరో అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని స్వర్ణ భారతి భవనంలో ఆదివా రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా రైతు నేస్తం అవార్డు అందుకున్నారు. అనంత రం శాలువాలతో సత్కరించారు. రైతునేస్తం ఫౌండేషన్ 21వ వార్షికోత్సవం సందర్భంగా సేంద్రియ వ్యవసాయం చేయడంతోపాటు ఆధునిక పద్ధతుల్లో వివిధ పంటలను సాగు చేస్తున్న బాలాజీని అవార్డుకు ఎంపిక చేశారు.


