పింఛన్ల పునరుద్ధరణకు సదరం శిబిరాలు
ఆసిఫాబాద్‌అర్బన్: దివ్యాంగ పింఛన్ల పునరుద్ధరణ కోసం ప్రత్యేక సదరం శిబిరాలు నిర్వహిస్తామని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్లు, డీఆర్‌డీఏ అధికారులు, డీపీఎంలు, ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షకులతో సమీక్ష నిర్వహించారు. సెర్ప్ సీఈవో మాట్లాడుతూ అంగవైకల్య నిర్ధారణ కోసం సదరం క్యాంపులు ఏర్పా టు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 600 మంది దివ్యాంగుల పింఛన్ పునరుద్ధరణకు జైనూర్, కౌటాల మండలా ల్లో ప్రత్యేక అంగ వైకల్య నిర్ధారణ పరీక్ష నిర్వహించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు, వీవోఏలు, సీసీలు, ఏపీఎంలతో స్లాట్ బుకింగ్‌పై అవగాహన కల్పిస్తామన్నారు. దివ్యాంగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారికి సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. సమావేశంలో డీపీఎం రామకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.


