
రసవత్తరంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడాపాఠశాలలో బుధవారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి హ్యాండ్‌బాల్, ఖోఖో పోటీలు రసవత్తరంగా సాగాయి. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి అండర్– 14, 17 హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి వందమంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రతిభ చూపిన 16 మంది బాలురు, 16 మంది బాలికలను జోనల్‌స్థాయికి ఎంపిక చేశామన్నారు. అలాగే అండర్– 14, 17 ఖోఖో ఎంపిక పోటీలకు 200 మంది క్రీడాకారులు హారు కాగా, 24 మంది బాలబాలికలు జోనల్‌స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపా రు. అండర్– 14 బాలబాలికల జోనల్‌స్థాయి పోటీలు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో నిర్వహిస్తామని, అండర్– 17 పోటీలు ఆదిలాబాద్ కొనసాగుతాయని వెల్లడించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్ద వ్, డీఎస్‌వో షేకు, ప్రిన్సిపాల్ జంగు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు అరవింద్, విద్యాసాగర్, తిరుమల్, పీఈటీలు లక్ష్మణ్, శారద, హరీశ్, భవ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు.