
అక్రమాలకు అడ్డుకట్ట..!
ఉపాధిహామీ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి యాప్‌లో ఆధార్, జాబ్‌కార్డు వివరాలు నమోదు జిల్లాలో ఇప్పటివరకు 74.19 శాతం పూర్తి
ఆసిఫాబాద్‌అర్బన్: ఉపాధిహామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. జాబ్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధిస్తున్నారు. ఇందుకోసం ఎన్‌ఆర్ ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉపాధిహామీ కింద పనిచేస్తున్న కూలీల ఆధార్ కార్డు, జాబ్‌కార్డు వివరాలను నమోదు చేసి ఫొటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఉపాధి పనులకు దూరం కానున్నారు.
1,22,602 మంది ఈకేవైసీ పూర్తి
జిల్లాలోని 335 పంచాయతీల పరిధిలో జిల్లాలో ఉపాధిహామీ పథకంలో 1,65,316 మంది కూలీలు ఉన్నారు. ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో కూలీల ఫొటోలు అప్‌లోడ్ చేయాలి. కానీ కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏలు) నకిలీ, పాత ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. పనులకు హాజరుకాకున్నా పాత ఫొటోలు పెడుతున్నారు. ఒకరి పేరుపై మరొకరు పనులకు వెళ్లినా హాజరు వేస్తున్నారు. మరోవైపు సామాజిక తనిఖీల్లో అక్రమాలు బయటపడుతున్నాయి. నిధులు పక్కదారి పడుతున్నట్లు తేలినా రికవరీ అంతంత మాత్రంగానే ఉంటోంది. వీటన్నింటికీ చెక్‌పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీని తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 1,22,602 మంది ఈకేవైసీ పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత యాక్టీవ్ కూ లీలు పనికి రాగానే ఒకసారి, పనులు పూర్తయిన త ర్వాత మరోసారి ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చే స్తారు. కూలీల వివరాలు యాప్‌లో నమోదు కాకపో తే పనులకు వెళ్లినా హాజరువేయలేరు. పనిప్రదేశంలో కాకుండా ఇతర ప్రాంతంలో తీసిన ఫొటోను అప్‌లోడ్ చేస్తే జీపీఎస్ సిస్టం గుర్తిస్తుంది. తప్పుడు హాజరుగా నిర్ధారిస్తుంది. ఈకేవైసీ వందశాతం పూ ర్తయితే ఈజీఎస్‌లో అవకతవకాలను నియంత్రించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
మండలాల వారీగా వివరాలు
మండలం మొత్తం ఈకేవైసీ పూర్తి
కూలీలు చేసుకున్నవారు
ఆసిఫాబాద్ 13,493 10,723
బెజ్జూర్ 12,215 9,005
చింతలమానెపల్లి 10,587 7,813
దహెగాం 13,585 10,094
జైనూర్ 12,523 8,299
కాగజ్‌నగర్ 12,308 10,712
కెరమెరి 14,450 8,420
కౌటాల 13,697 11,010
లింగాపూర్ 7,976 5,812
పెంచికల్‌పేట్ 6,567 5,321
రెబ్బెన 11,295 7,113
సిర్పూర్(టి) 7,900 6,552
సిర్పూర్(యూ) 7,548 4,621
తిర్యాణి 9,914 7,925
వాంకిడి 11,205 9,177