
నిబంధనలు పాటించాలి
చింతలమానెపల్లి(సిర్పూర్): ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాల డీలర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) వెంకటి అన్నారు. మండలంలోని రణవెల్లి, రవీంద్రనగర్, చింతలమానెపల్లి గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను బుధవారం తనిఖీ చేశారు. రికార్డులు, నిల్వలు పరిశీలించారు. డీఏవో మాట్లాడుతూ రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పురుగుమందులు వాడే విధానం లేబుళ్లపై ముద్రించి ఉంటుందని, రైతులు గమనించాలని సూచించారు.
తనిఖీ చేస్తున్న డీఏవో వెంకటి