బైక్‌పై వెళ్లి.. తనిఖీ చేసి
కెరమెరి(ఆసిఫాబాద్): సరైన రహదారి సౌకర్యం లేని కెరమెరి మండలం ఇందాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి బైక్‌పై వెళ్లి సందర్శించారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఉపాధ్యాయు ల డైరీ, విద్యార్థుల రిజిస్టర్లు, ఇతర రికార్డులు తనిఖీ చేశారు. కూలేందుకు సిద్ధంగా గదులను పరిశీలించారు. వంట గది నిర్మాణం చేపట్టాలని ఎంపీడీవో అంజద్‌పాషాను ఆదేశించారు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాతే అదనపు తరగతి గదిని హ్యాండోవర్ చేసుకోవాలని సూచించారు. నూతనంగా తీసుకువచ్చిన టీవీని ప్రారంభించారు. అనంతరం గోయగాం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంఈవో ఆడే ప్రకాశ్, ఉపాధ్యాయులు శ్రావణ్‌కుమార్, రమేశ్, భరత్‌రావు, అరుణ్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు.


