పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీటీసీవోఏ క్లబ్‌లో స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా బుధవారం స్వచ్ఛత శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులు ఇంటి మాదిరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. ఏరియాలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులు పేపర్ గ్లాస్‌లు, మట్టి వస్తువులను వినియోగించా లని సూచించారు. స్వచ్ఛతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి ఆర్గనైజింగ్ కార్యదర్శి మారం శ్రీనివాస్, అధికా రుల సంఘం ఏరియా ప్రతినిధి ఉజ్వల్‌కుమార్ బెహరా, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, డీజీఎం సివిల్ ఎస్‌కే మదీనా బాషా, ఇన్‌చార్జి ఎన్విరాన్‌మెంట్ అధికారి రమేశ్, సెక్యూరిటీ అధికారి శ్రీధర్, ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్, ఎస్టేట్స్ అధికారి సాగర్, ఐటీ మేనేజర్ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.


