
దీపావళి.. ఆనందకేళి
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లావ్యాప్తంగా ప్ర జలు సోమవారం దీపావళి పండుగను ఆనందో త్సాహాల మధ్య జరుపుకొన్నారు. ప్రజలు, వ్యాపారులు ఇళ్లు, దుకాణాలను మామిడి తోరణాలు, పూ లు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సాయంత్రం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని సాయి బాబా మందిర్, వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, కేస్లాపూర్ హనుమాన్ మందిర్ తదితర ఆలయాలను భక్తులు సందర్శించారు. శిర్డీ సాయి మందిరంలో అర్చకులు మధుకరశర్మ, సాయిశర్మ ఆధ్వర్యంలో ఉదయం ధనలక్ష్మీ, సరస్వతీ దేవి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ధనలక్ష్మీ, సరస్వతీ దేవి పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో వ్యాపారులు నిర్వహించిన లక్ష్మీ పూజలకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హాజరయ్యారు. పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లో పెద్దఎత్తున బంతిపూల అమ్మకాలు జరిగాయి. స్వీట్ హౌజ్‌లు, బట్టల దుకాణాలు, జువెల్లరీ షాపులు కొనుగోలుదారులతో కిటికిటలాడాయి.
కాగజ్‌నగర్‌లో నరకాసుర దహనం
నరక చతుర్దశిని పురస్కరించుకుని కాగజ్‌నగర్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో సోమవారం నరకాసుర దహనం ఘనంగా నిర్వహించారు. శ్రీరామచంద్ర జీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ నరకాసుర వధతో మనలోని దుష్టశక్తులను పారదోలాలన్నారు.
నరకాసుర దహనంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు, శ్రీరామచంద్ర జీయర్‌స్వామి
లక్ష్మీ పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కాగజ్‌నగర్‌లో
దీపాలతో చిన్నారి

దీపావళి.. ఆనందకేళి

దీపావళి.. ఆనందకేళి