
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించేవరకు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్ల సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తెలిపారు. జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం 40వ రోజుకు చేరింది. ఆయన మాట్లాడుతూ డైలీ వేజ్ కార్మికులకు ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనా లు అడిగితే కార్మికులను తొలగిస్తామని సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో కార్మికులు సునీత, రమేశ్, కోటయ్య, రాంబాయి, శివరాం, ప్రేమ్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.