
అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలి
కాగజ్‌నగర్‌రూరల్: గంజాయి మత్తులో దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ఆధ్వర్యంలో ఈజ్‌గాం పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ విలేజ్ నం.12లో ఉజ్జల్ బక్షి, రవీందర్ బక్షి అనే ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతూ, గ్రామానికి చెందిన దీపక్ మండల్, సూరజ్, నితీశ్ మండల్‌పై దాడి చేశారని ఆరోపించారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, గ్రామంలో గంజాయి అమ్మకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు మమతా రానా, కార్యదర్శి కాజల్ బిస్వాస్, గీతాహల్దార్, సుచిత్ర, పార్వతి, భార్గవి, హల్దార్ తదితరులు పాల్గొన్నారు.