
పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివి
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. మొదట పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అమరుల కుటుంబ సభ్యులను పలకరించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. పోలీసులు కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ దేశవ్యాప్తంగా వీరమరణం పొందిన పోలీసుల పేర్లు చదివి వినిపించారు. అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దన్న, జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు విజయ శంకర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, సీఐ బాలాజీ వరప్రసాద్, ఆర్‌ఐ ఎంటీవో అంజన్న, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.