
‘శ్రావణిది కుల దురహంకార హత్యే’
దహెగాం(సిర్పూర్): దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలాండి శ్రావణిది కుల దురహంకార హత్యేనని కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు సరోజన అన్నా రు. సోమవారం శ్రావణి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె మాట్లాడుతూ కుమారుడు తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తండ్రి సత్తయ్య కక్ష పెంచుకుని, నిండు గర్భిణి శ్రావణిని హత్య చేశాడని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్ష ల పరిహారం, ఐదెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వడంతోపాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేఏఎన్‌పీఎస్ రాష్ట్ర కోశాధికారి మోహనకృష్ణ, నా యకులు చక్రవర్తి, ఎస్.లక్ష్మయ్య, కృష్ణన్న, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.