
అంబులెన్స్‌లో ప్రసవం
నార్నూర్: మండలంలోని సుంగాపూర్ పంచా యతీ పరిధి కొలాంగూడకు చెందిన దుర్వా రు క్మాబాయి అనే గర్భిణి 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. శనివారం రాత్రి పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకోగా పురిటినొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్సులో ఆమెకు ప్రసవం చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షే మంగా ఉన్నట్లు ఫైలట్ రాజ్‌కుమార్ తెలిపా రు. ఆమెను నార్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. అంబులెన్స్ సిబ్బందిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.