
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..
ఆసిఫాబాద్‌అర్బన్: మీడి యా స్వేచ్ఛకు ఆటంకం కలిగించొద్దు. గతంలో ఏ ప్రభుత్వం కూడా మీడియాపై అణచివేతకు పాల్ప డిన ఘటనలు లేవు. తప్పు డు వార్తలు రాస్తే వివరణ అడగాలి. అంతేగాని దౌర్జన్యానికి దిగడం సరికాదు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. సాక్షి పత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసులు తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– రాపర్తి రవీందర్,
ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అతి ముఖ్యమైంది. ఒకరు బహిరంగంగా చెప్పిన దానిని వార్తగా ప్రచురిస్తే సాక్షి పత్రిక ఎడిటర్‌పై కేసు పెట్టడం సమంజసం కాదు. కక్ష సాధింపు చర్యలను సమాజం హర్షించదు. రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్న ఈ ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేయడం, తప్పుడు కేసులు పెట్టడం అప్రజాస్వామికం.
– బోగె ఉపేందర్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
సమాజం హర్షించదు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే..