
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
రెబ్బెన(ఆసిఫాబాద్): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై ‘సాక్షి’లో ఈ నెల 8న ప్రచురితమైన ‘రెచ్చిపోతున్న ఇసుకాసురులు’ అనే కథనానికి అధికారులు స్పందించారు. రెబ్బెన మండలం పులికుంట వాగు నుంచి ఎలాంటి ప్రభు త్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ ఏడీ గంగాధర్, ఎంవీఐ మోహన్ సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లతో పా టు సరైన ధ్రువపత్రాలు లేని రెండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇసుక ట్రాక్టర్లు పట్టివేత