
డిజిటల్ తరగతులతో నాణ్యమైన విద్య
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థులకు డిజిటల్ తరగతుల ద్వారా నాణ్యమైన విద్య అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి అన్నా రు. కాగజ్‌నగర్ పట్టణంలోని జెడ్పీఎస్‌ఎస్ పెట్రోల్ పంప్ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వి ద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధించాలన్నారు. పఠనంపై ఆసక్తి కలిగేలా పాఠ్యపుస్తకాలు, గ్రంథాలయాల్లోని పుస్తకాలను అరగంట పాటు గట్టిగా చదవడం అలవాటు చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలోని మంచినీటి సదుపాయం, వంటగదులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో వాసాల ప్రభాకర్, పెంచికల్‌పేట్ ఎంఈవో తోట రమేశ్‌బాబు, ప్రధానోపాధ్యాయుడు వెంకట రాజయ్య, ప్రమీలదేవి, పర్శ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.