
ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని డయాలసిస్ కేంద్రాన్ని విస్తరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు బుధవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో కలిశారు. సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన 90 మంది కిడ్నీ రోగులకు డయాలసిస్ అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గల డయాలసిస్ కేంద్రంలో ఐదు పడకలు మాత్రమే ఉన్నాయని, దీనిని 10 పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరో డయాలసిస్ కేంద్రం మంజూరు చేయాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సిర్పూర్ మాజీ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ ఉన్నారు.
కూరగాయల సాగుతో లాభాలు
కెరమెరి(ఆసిఫాబాద్): రైతులు తమకున్న సాగు భూమిలో కొంతస్థలంలో కూరగాయలు సాగుచేసిలాభాలు సాధించవచ్చని బెల్లంపల్లి ఉద్యానవన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి అన్నారు. మండలంలోని పెద్దసాకడ గ్రామంలో బుధవారం చిక్కుడు సాగులో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంట సాగు, అధిక వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ఆత్రం బల్లార్ షా సాగు చేస్తున్న వంకాయ తోటను పరిశీలించి సూచనలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, రైతులు కేంద్రె బాలాజీ, కుమురం న్యానేశ్వర్, ఆడ రాంచందర్ తదితరులు ఉన్నారు.

ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ‘పాల్వాయి’