
కాగజ్‌నగర్ స్టేషన్ పరిశీలించిన డీఆర్‌ఎం
కాగజ్‌నగర్‌టౌన్/కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌ను బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఆర్.గోపాలకృష్ణన్ పరిశీలించారు. వందేభారత్ రైలు హాల్టింగ్ కోసం స్టేషన్‌లోని సౌకర్యాలపై ఆరా తీశారు. ప్లాట్‌ఫాం నం.1లో ప్రయాణికుల కుర్చీల ఎత్తు పెంచాలని సూచించారు. అ డ్డంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. క్యాంటీన్ పక్క నుంచే వెళ్లే ఫ్లై ఓవర్ వంతెనకు పరదాలు ఏర్పాటు చేసి, దుమ్ము రాకుండా చూడాలన్నారు. అనంతరం డీఆర్‌ఎంను రైల్వే యాత్రి సేవా సమితి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. రైల్వే యాత్రి సమితి అధ్యక్షుడు ప్రయాగ్ తివారి మాట్లాడుతూ వందేభారత్ రైలు హాల్టింగ్ ఇవ్వడం అభినందనీయమన్నారు. తమిళనాడు, కేరళ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు సైతం హాల్టింగ్ ఇవ్వాలని డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
కాగజ్‌నగర్ రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగుల మహిళలు డీఆర్‌ఎంకు సమస్యలు విన్నవించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, వ ర్షాలకు వరద వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిచ్చిమొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదన్నా రు. రాత్రిపూట పోలీసు సెక్యూరిటీ కల్పించాలని కో రారు. విడతలవారీగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్‌డీఎం హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ నవీన్‌కుమార్, డీవోఎం సురేశ్, డీసీఎం సఫాలీ, పీఆర్వో పవన్ బల్‌దేవ్, ఆర్పీఎఫ్ ఎస్సై ప్రాచీదేవి, ఏఎస్సై ఆర్.దాసు, సిబ్బంది పాల్గొన్నారు.