
35శాతం లాభాల వాటా చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాల నుంచి కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్‌పీలో మంగళవారం ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు వెంటనే ప్రకటించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిలో తిరిగి తీసుకువచ్చిన మెడికల్ బోర్డును మార్చి నుంచి నిలి పివేసినా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రభుత్వ సంఘంగా చెప్పుకునే ఐఎన్‌టీయూసీ యాజమాన్యంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. కాంట్రాక్టు కా ర్మికులకు లాభాల నుంచి వాటా రూ.20వేలకు పెంచాలన్నారు. ఇప్పటికై నా కార్మికుల సమస్యలు పరి ష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరి యా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మంగీలాల్, ఏరియా కార్యదర్శులు సంపత్, వెంకటేశ్వర్లు, సమ్మయ్య, శ్రీనివాస్, వెంకన్న, మురళీకృష్ణ, విద్యాసాగర్ పాల్గొన్నారు.