టీఎస్‌ఎస్ కళాకారుల జిల్లా కార్యవర్గం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం పౌర సంబంధాల అధికారి వై.సంపత్‌కుమార్ అధ్యక్షతన తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్‌ఎస్) జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుడిసెల బాపురావు, గౌరవ అధ్యక్షుడిగా మోహన్‌నాయక్, ఉపాధ్యక్షురాలిగా వెన్నెల, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం, కోశాధికారిగా సోమశేఖర్, సహాయ కార్యదర్శిగా శిరీషను ఎన్నుకున్నారు. డీపీఆర్‌వో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
బురద రోడ్డు.. దిగబడిన బస్సు