
యూరియా కోసం రైతుల రాస్తారోకో
కాగజ్‌నగర్‌రూరల్: యూరియా బస్తాలు ఇవ్వడం లేదని కాగజ్‌నగర్‌లోని భట్టుపల్లి చౌరస్తా వద్ద రైతులు మంగళవారం రాస్తారోకో చేశారు. ప్రభుత్వం తగినంత పంపిణీ చేయడం లేదని, అలాగే అధికా రులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించా రు. టోకెన్లు పంపిణీ చేసి బస్తాలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. వ్యవసాయ పనులను వదులు కుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని, ఆందోళన చేసిన ప్రతీసారి రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పారు. ఏవో రామకృష్ణ స్పందించి.. రెండు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విర మించారు. నాయకులు పొన్న రమేశ్, ముజామిలుద్దీన్ అహ్మద్ మద్దతు తెలిపారు.