
కాళోజీ జీవితం ఆదర్శం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందిరికి ఆదర్శం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కాళోజీ కేవలం కవి మాత్రమే కాదని, స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజ సేవకుడు, సంఘ సంస్కర్త, తెలంగాణ సాయుధ పోరాట వీరుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ(ఎంటీ) అంజన్న, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
13న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్, సిర్పూర్(టి) కోర్టుల్లో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్న ట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలి పారు. యాక్సిడెంట్, దాడి, చీటింగ్, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చిన్న దొంగతనం, డ్రంకెన్ డ్రైవ్, ఇతర కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారలు, నేరస్తులు సంబంధిత పోలీస్ స్టేషన్, కోర్టు కానిస్టేబుల్‌ను సంప్రదించాలని సూచించారు.